ఆంద్రజ్యోతి న్యూస్ పేపర్లపై శానిటైజర్ స్ప్రే

దేశవ్యాప్తంగా పాటిస్తున్న లాక్డౌన్ కారణంగా అనేక సంస్థలు తమ వ్యాపారాలను మూసివేశాయి. అయితే, ఈ లాక్డౌన్ నుంచి నిత్యావసర వస్తువుల దుకాణాలు, ఆస్పత్రులు, బ్యాంకులు, మీడియా కార్యాలయాలను మినహాయించారు. కరోనా గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియాలంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఎంతో అవసరం.

ఈ నేపథ్యంలో, ప్రింట్ మీడియా నుంచే వార్తా పత్రికల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందనే అపోహలు కూడా ఉన్నాయి. న్యూస్ పేపర్లు ఒకచోట ప్రింట్ అనేక చేతులు మారిన తర్వాత పాఠకులకు చేరుతాయి. ఈ క్రమంలో కరోనా సోకిన వ్యక్తి ఎవరైనా ఉంటే ఆ న్యూస్ పేపర్ ద్వారా తమకు కూడా కరోనా సోకవచ్చనే అనుమానంతో చాలా మంది పేపర్‌ను ముట్టుకోవటం మానేశారు.

అయితే, ఆంధ్రజ్యోతి పేపర్ మాత్రం ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని తాము ప్రింట్ చేసే అన్ని న్యూస్ పేపర్లపై శానిటైజర్‌ను స్ప్రే చేస్తోంది. న్యూస్ పేపర్‌పై కొన్ని గంటల పాటు ఈ శానిటైజర్ ప్రభావం ఉంటుంది, కాబట్టి పాఠకులు ఎలాంటి భయం లేకుండా పేపర్లను చేతులతో ముట్టుకోవచ్చని తెలుస్తోంది.
abn-paper

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s