ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వివరాలను తెలిపేందుకు ఇప్పటికే అలీబాబా, గూగుల్, న్యూస్‌గార్డ్ వంటి టెక్ కంపెనీలు మొబైల్ అప్లికేషన్లను తయారు చేశారు. ఇదే కోవలో తాజాగా యాపిల్ సంస్థ కూడా ఓ కొత్త అప్లికేషన్‌ను వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. యాపిల్ ప్లే స్టోర్‌లో Apple COVID-19 పేరుతో ఈ యాప్‌ను విడుదల చేశారు.
ఈ యాప్ ద్వారా వ్యాధి లక్షణాలు, రిస్క్ ఫ్యాక్టర్స్, ఇటీవల నమోదైన కేసులు మొదలైన వివరాలను ప్రజలు తెలుసుకోవచ్చని యాపిల్ తెలిపింది. యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సిడిసి), ఫెమా మరియు వైట్‌హౌస్ కరోనావైరస్ టాస్క్‌ఫోర్స్ సంస్థలతో కలిసి ఈ యాప్‌ను తయారు చేసినట్లు యాపిల్ పేర్కొంది.
వెబ్సైట్ లింక్: https://www.apple.com/covid19/
మొబైల్ యాప్ లింక్: https://apps.apple.com/us/app/id1504132184