కరోనాతో పోరాండేందుకు నేను సైతం అంటూ గూగుల్ సంస్థ ముందుకొచ్చింది. కరోనాపై పోరుకు తమ వంతు సాయంగా బిజినెస్ అండ్ క్రైసిస్ రెస్పాన్స్ కోసం 800 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అలాగే ప్రజలు మరియు వైద్యుల కోసం 20 నుంచి 30 లక్షల ఫేస్ మాస్కులను సిడిసి ఫౌండేషన్‌కు అందిస్తామని గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చాయ్ ఓ ప్రకటనలో తెలిపారు.
మాగిడ్ గ్లవ్ అండ్ సేఫ్టీ కంపెనీ ద్వారా ఈ ఫేస్ మాస్కులను తయారు చేయిస్తున్నామని చెప్పారు. ఇందులో 250 మిలియన్ డాలర్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)కి, 200 మిలియన్ డాలర్లను నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లకు, చిన్నపాటి వ్యాపార సంస్థల ప్రయోజనార్థం ఉపయోగించనున్నారు.
అలాగే, గతేడాది పైగా యాక్టివ్ గూగుల్ అకౌంట్స్ కలిగిన చిన్న, మధ్య తరహా వ్యాపారులకు 340 మిలియన్ డాలర్ల గూగుల్ యాడ్ క్రెడిట్‌ను, మిగిలిన నిధులను గూగుల్ క్లౌడ్ క్రెడిట్ల ద్వారా అందుబాటులో ఉంచుతాని కంపెనీ పేర్కొంది.