ఇటలీ దేశంలో కరోనా మరణాల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. కరోనా వైరస్ సోకిన వారిలో నిన్న ఒక్క రోజులోనే గరిష్టంగా వెయ్యి మంది వరకూ చనిపోయారు. ఇటలీలో ఒకేరోజులో ఇంత ఎక్కువ మంది చనిపోవటం ఇదే మొదటిసారి.
కరోనాతో ఇప్పటి వరకూ ఇటలీలో మరణించిన వారి సంఖ్య 9,134కి చేరింది. యూరప్‌లో కెల్లా అత్యధిక కరోనా మరణాల కేసులు ఇటలీలోనే నమోదయ్యాయి. రోగులకు సరైన వైద్యం కల్పించే పరికాలు తక్కువగా ఉన్నందునే ఇంత అధిక సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఇటలీలో ఐదు వారాల క్రితం మూడు కరోనా కేసులు మాత్రమే ఉండేవి, ఇప్పుడ అవి 86,500కు చేరుకున్నాయి. కేవలం 5 వారాల వ్యవధిలో ఇంత అధిక సంఖ్యలో కరోనా కేసులు, మరణాలు నమోదు అవుతున్నాయంటే ఆ దేశంలో పరస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో కూడా ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే, ప్రజలంతా సంయమనం పాటించి, ఎవరి ఇళ్లలో వారు ఉండటం ఎంతో అవసరం. కరోనాను ఎదుర్కోవటానికి ఇదొక్కటే మార్గం.