కరోనాకు పేద, ధనిక, కుల, మత, ప్రాంత భేదాలు లేవు. కరోనా ఎవ్వరినీ విడిచిపెట్టడం లేదు. బ్రిటన్ యువరాజు ప్రిన్స్ చార్లిస్ ఇప్పటికే కరోనా వైరస్‌తో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండగా.. తాజాగా బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌కు కూడా కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
జాన్సన్ ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నారు. కరోనా రోగులను పర్యవేక్షించేందుకు ఆయన ఇదివరకు ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. ఈనేపథ్యంలోనే జాన్సన్‌కు కరోనా సోకి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం బోరిస్ జాన్సన్ వయసు 55 ఏళ్లు, ఆయన సతీమణ ఇప్పుడు గర్భంతో ఉంది. జాన్సన్టతో చ్లో ఉన్న అధికారులంతా సెల్ఫ్ క్వరైంటైన్లో ఉన్నారు.
బోరిస్ జాన్సన్ కోలుకోవాలని మోడీ ప్రార్థన
బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ కరోనా వైరస్ నుంచి త్వరగా కోలుకోవాలని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ట్విట్టర్ వేదికగా బోరిస్‌ను ఉద్దేశిస్తూ ఈమేరకు ఓ పోస్ట్ పెట్టారు. ‘మీరు యోధులు, ఈ పరిస్థితిని విజయవంతంగా ఎదుర్కుంటారు. మీ ఆరోగ్యం కోసం మరియు బ్రిటన్ ప్రజల ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేస్తున్నాను’ అని నరేంద్ర మోడీ అన్నారు.