కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా పాటిస్తున్న లాక్డౌన్ కారణంగా, దేశంలో అన్నిచోట్లా మద్యం దుకాణాలు మూతపడటంతో మందు బాబులకు వేరే ఆప్షన్ లేక కల్లు దుకాణాలపై పడ్డారు. కొన్నిచోట్ల అయితే కల్లు దుకాణాల వచ్చే వరకు కూడా ఆగట్లేదు, కల్లు గీసేవారు ఏ చెట్టు దగ్గర ఉంటే ఆ చెట్టు దగ్గరకే పరుగులు తీస్తున్నారు.
మరికొన్ని ప్రాంతాల్లో అయితే, కల్లు తాగడం కోసం వచ్చిన వారు ఇదిలో ఇలా సోషల్ డిస్టెన్స్ (సామాజిక దూరం) పాటించేలా కల్లుగీత కార్మికులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి వ్యక్తి కనీసం పది అడుగులు దూరం ఉండేలా బాక్సులు గీసారు. మరి కరోనా సోకకుండా కల్లు తాగాలంటే మాత్రం క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాల్సిందే అంటున్నారు వ్యాపారులు.