భారతదేశంలో కరోనా శరవేగంగా వ్యాపిస్తోంది. ప్రస్తుతం ఇది రెండవ దశ (సెకండ్ స్టేజ్)లో ఉంది, ఇది మూడవ దశకు చేరుకుంటే మనకు పెను ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉంది. కరోనా కారణంగా భారత్లో ఇప్పటి వరకూ వివిధ రాష్ట్రాల్లో 25 మంది మృతి చెందారు. మనదేశంలో ప్రస్తుతం ఈరోజు నాటికి (మార్చ్ 29) కరోనా కేసుల సంఖ్య 979గా ఉంది, వీరిలో 48 మంది విదేశీయులు ఉన్నట్లు సమాచారం.
దేశంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కరోనా ఆస్పత్రుల్లో చేరిన వారి సంఖ్యతో పోల్చుకుంటే డిశార్చ్ అయి వెళ్లే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. ఇప్పటి వరకూ సుమారు 87 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా కేసుల్లో మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. మహారాష్ట్రలో గరిష్టంగా 186 కేసులు ఉంటే, కేరళలో 182 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రాల వారీగా కేసులు ఇలా ఉన్నాయి (మార్చ్ 29 నాటికి):
ఆంధ్రప్రదేశ్ – 14
అండమాన్ నికోబార్ – 9
బీహార్ – 9
ఛండీఘడ్ – 8
ఛత్తీస్ఘడ్ – 6
ఢిల్లీ – 39
గోవా – 3
గుజరాత్ 53
హర్యానా – 33
హిమాచల్ ప్రదేశ్ – 3
జమ్మూ అండ్ కాశ్మీర్ – 31
కర్ణాటక – 76
కేరళ – 182
లఢక్ – 13
మధ్యప్రదేశ్ – 30
మహారాష్ట్ర – 186
మణిపూర్ – 1
మిజోరాం – 1
ఒడిషా – 3
పుదుచ్చేరి – 1
పంజాబ్ – 38
రాజస్థాన్ – 54
తమిళనాడు – 42
తెలంగాణా – 66
ఉత్తరాఖాండ్ – 6
ఉత్తరప్రదేశ్ – 55
పశ్చిమ బెంగాల్ – 17
ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటికే కరోనా మరణాలు 30,000 దాటాయి. కరోనాతో ఇటలీలో అత్యధికంగా 10,000 మందికి పైగా ప్రాణాలు వదిలారు.