బిఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్ గడువు పొడగింపు

కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా అమలులో ఉన్న లాక్డౌన్ కారణంగా బిఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్ ఆలస్యం కానుంది. వాస్తవానికి ఈనెలాఖరు లోగా అన్ని రకాల బిఎస్-4 వాహనాలను విక్రయించే సంస్థలను తమ స్టాక్‌ను క్లియర్ చేసుకోవాల్సి ఉంది. అలాగే బిఎస్-4 వాహనాలను కొనుగోలు చేసిన వాహనదారులు కూడా వీటిని నెలాఖరులో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

కానీ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో లాక్డౌన్ ముగిసిన పది రోజుల్లోబా బిఎస్-4 వాహనాల స్టాకులో 10% అమ్ముకోవచ్చని సుప్రీం కోర్టు జస్టిస్ అరుణ్ మిశ్రా నాయకత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. కాగా.. ఢిల్లీ మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో (ఎన్సీఆర్) మాత్రం ఈ నియమాలు వర్తించవు.

ఇదివరకటి నిబంధనల ప్రకారం, బిఎస్-4 వాహనాలను కొనుగోలు చేసిన పది రోజుల్లోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత లాక్డౌన్ కారణంగా ఈ నెల 31లోపు కొన్న వాటిని అలాగే లాక్డౌన్ తర్వాత కొనుగోలు చేసే వాహనాల రిజిస్ట్రేషన్ గడువును ఏప్రిల్ 24 వరకూ పొడగిస్తున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది.

activa

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s