ఏపీలో మొబైల్ రైతు బజార్లు; ఉదయం 11 వరకే అనుమతి

దేశవ్యాప్తంగా అమలులో ఉన్న లాక్‌డౌన్‌ను రాష్ట్రంలో మరింత పటిష్టంగా అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రజలందరూ సహకరించాలని, ఈ 21 రోజుల పాటు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా రాష్ట్రంలో మొబైల్ రైతు బజార్లను అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

ఇప్పటికే కొన్ని జిల్లాల్లో మొబైల్ రైతు బజార్లు ప్రజల వద్దకే కూరగాయలు, నిత్యావసర వస్తువులను చేర వేస్తున్నాయి. మరోవైపు లాక్‌డౌన్ అమలులో ఉన్నప్పటికీ, నిత్యావసర సరుకుల నెపంతో ప్రజలు రోడ్లపై వస్తున్న నేపథ్యంలో, పట్టణాల్లో మధ్యాహ్నం 1 గంట వరకు తెరచి ఉంచే కిరాణా షాపులను ఉదయం 11 గంటల వరకు మాత్రమే ఓపెన్ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఇందులో భాగంగానే పట్టణాలు, నగరాల్లో ఉదయం 6 నుంచి ఉదయం 11 వరకే నిత్యావసరాలను విక్రయించేందుకు షాప్ ఓనర్లకు అనుమతి ఇచ్చారు. ఇతర ప్రాంతాల్లో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే అనుమతి ఉంటుందన్నారు. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించి, నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తే వారిపై కేసులు పెడతామని హెచ్చరించారు సీఎం జగన్. ప్రతి షాపు వద్ద నిత్యావసరాల ధరలను డిస్‌ప్లే చేయాలని అన్నారు. ఎవరైనా అధిక ధరకు విక్రయిస్తున్నట్లు తెలిస్తే, కాల్ సెంటర్ ద్వారా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు.

ap-news

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s