స్పెయిన్‌లో కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. కరోనా దాడికి స్పెయిన్ రాణి కూడా ప్రాణాలు కోల్పోయారు. కరోనా వ్యాధి సోకడంతో స్పెయిన్ రాణి మారియా థెరీసా డె బార్బన్-పార్మా మృతి చెందారు. చనిపోయే నాటికి ఆమె వయసు 86 ఏళ్లు. థెరీసా మరణ వార్తను ఆదివారం నాడు ఆమె సోదరుడు మీడియాకు వెల్లడించారు.
సోర్బోన్ యూనివర్సిటీలో సోషియాలజీ ప్రొఫెసర్‌గా పనిచేసిన మారియా థెరీసా లెఫ్టిస్ట్ భావాలు కలిగిన వ్యక్తి. ఆమెను రెడ్ ప్రిన్సెస్‌గా పిలిచేవారు. కరోనా కారణంగా స్పెయిన్‌లోని రాజ కుటుంబం నుంచి మరణించిన తొలి వ్యక్తి మారియా థెరీసా. ఇప్పటికే, యూకేలోని 71 ఏళ్ల ప్రిన్స్ చార్లెస్‌కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు.
స్పెయిన్‌లో కరోనా కేసులు ఏమాత్రం తగ్గటం లేదు. అక్కడ ఇప్పటి వరకూ 73,000 లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇప్పటికే 5982 మంది ప్రాణాలు కోల్పోయారు.