భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తే, ఆ ధాటిని తట్టుకునేందుకు కేంద్రం ముందస్తు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే, రైళ్లను ఐసోలేషన్ వార్డులుగా తీర్చిదిద్దుతోంది. ఏసీ కోచ్‌లలోని బెర్త్‌లను ఐసోలేషన్ బెడ్లుగా మార్చారు. కరోనా వలన ఎదురు కాబోయే ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భారత రైల్వే ప్రకటించింది.
దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో భారీ సంఖ్యలో ట్రైన్లను ఐసోలేషన్ వార్డులుగా మార్చి కరోనా పేషెంట్లకు చికిత్స అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ఒక బోగీలో వెంటిలేటర్లతో ఇతర వైద్య పరికరాలతో రోగులకు చికిత్స అందించేలా అన్ని వసతులను కల్పించారు. అయితే, దీనికి ఇంకా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆమోదం తెలపాల్సి ఉంది.