కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు అంటే ఏప్రిల్ 14వ తేదీ వరకూ లాక్డౌన్ను పాటిస్తున్న సంగతి మనందరికీ తెలిసినదే. అయితే, దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, ఈ లాక్డౌన్ను మరికొన్ని రోజుల పాటు పొడగిస్తారనే పుకారు ఇప్పుడు నెట్టింట షికారు చేస్తోంది. ఈ పుకార్లపై కేంద్రం స్పందించింది.
ప్రభుత్వం 21 రోజుల విధించిన లాక్డౌన్ను మరిన్ని రోజులు పొడిగిస్తుందని వస్తున్న వార్తలు పుకార్లు మాత్రమే. ఇవన్నీ నిరాధారమైనవి క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా తెలిపారు. ఇలాంటి వార్తలు తమను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని, లాక్డౌన్ను పొడిగించే ఆలోచన కేంద్రానికి లేదని ఆయన స్పష్టం చేశారు.
ఓవైపు కరోనా మహమ్మారి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంటే మరోవైపు ఇలాంటి పుకార్లు వారి భయాన్ని ఇంకొంత పెంచుతున్నాయి. ఏదేమైనప్పటికీ, ప్రజలు మాత్రం సంయమనం పాటించి, ఇళ్లకే పరిమితమై, ధైర్యంగా ఉండాలని కోరుతున్నాం.