మనం నిత్యం ఉపయోగించే సోషల్ మీడియా యాప్ వాట్సాప్‌లో డార్క్ మోడ్ అనే కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. కళ్లకు ఇబ్బంది కలగకుండా ఉండేలా బ్యాగ్రౌండ్ స్క్రీన్ కలర్‌ను బ్లాక్ కలర్లోకి మార్చుకోవటానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
డార్క్ మోడ్ ఆప్షన్‌తో వాట్సాప్ చాట్ బ్యాక్ గ్రౌండ్ బ్లాక్ కలర్లోకి మారుతుంది. వాట్సాప్ సెట్టింగ్స్‌లోని చాట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆ తర్వాత థీమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే అందులో సిస్టమ్ డిఫాల్ట్, లైట్, డార్క్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి.
ఇందులో డార్క్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకుంటే వాట్సాప్‌లో డార్క్ మోడ్ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. నాలుగు స్టెప్స్‌తో దీన్ని యాక్చివేట్ చేసుకోవచ్చు.
1. సెట్టింగ్స్
2. చాట్స్
3. థీమ్
4. డార్క్