జీతాల్లో కోత మీ భవిష్యత్తు కోసమే!

కరోనా కట్టడి కోసం పాటిస్తున్న లాక్‌డౌన్ మరో రెండు వారాల పాటు కొనసాగనున్న నేపథ్యంలో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంధకారంలో పడకుండా ఉండేందుకు గానూ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో ఆర్థిక పరిస్థితిపై సమీక్ష చేసిన కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించారు. ఇలా చేయటం ద్వారా వచ్చిన నిధులను కరోనా క్రైసిస్ కోసం వినియోగించనున్నారు.

కరోనా వైరస్‌ కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైనందువల్ల ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం కోత విధించాలని నిర్ణయించారు. సీఎం, మంత్రివర్గం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్పోరేషన్‌ ఛైర్మన్లు, స్థాని సంస్థల ప్రజా ప్రతినిధులు ఈ పరిధిలోకి వస్తారు.మరోవైపు తెలంగాణలో అఖిల భారత సర్వీసు ఉద్యోగుల వేతనాల్లో 60 శాతం కోత విధించారు.

kcr-pay-cut

మిగిలిన అన్ని కేటగిరీ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోతను అలాగే నాలుగో తరగతి, పొరుగుసేవలు, ఒప్పంద ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోతని విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో అన్ని రకాల రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్‌న్లలో 50 శాతం కోత విధించనున్నారు. నాలుగో తరగతి రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్లలో 10శాతం కోత పడనుంది.

అంతేకాకుండా.. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థల ఉద్యోగులు వేతనాల్లోనూ కోత విధించనున్నారు. తెలంగాణ ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థల ఉద్యోగుల వేతనాల్లో కూడా కోత విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

https://platform.twitter.com/widgets.js