మీకు కూడా బయట ఎక్కడ పడితే అక్కడ పానీపూరీ తినే అలవాటు ఉందా..? అయితే, ఈ న్యూస్ చూడండి, కరోనా కట్టలు తెంచుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో పానీపూరీ బండి నడిపే వాళ్లకి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ సంఘటన విజయవాడలో చోటు చేసుకుంది. పానీపూరీ వ్యాపారం చేసే వ్యక్తికి పాజిటివ్ రావటంతో విజయవాడలో కలకలం రేగుతోంది.
విజయవాడలోని కృష్ణ లంకలో పానీపూరి వ్యాపారికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవలే ఆ వ్యాపారి మక్కా వెళ్లి వచ్చాడని, నగరంలో అతదనికి 20 తోపుడు బండ్లు ఉన్నాయని సమాచారం. ద్వారా నగరంలో పానీపూరి విక్రయాలు కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది.
సదరు వ్యాపారి కుటుంబంలోని ఎనిమిది మందికి, అతని దగ్గర పనిచేసే మరో 14 మందికి వైద్య కరోనా పరీక్షలు చేస్తున్నారు. కృష్టలంకలోని కరోనా తీవ్రత దృష్ట్యా ఇవాళ అక్కడ పూర్తిస్థాయిలో బంద్కికి ఆదేశాలు ఇచ్చారు జిల్లా కలెక్టర్.