అమెరికాలో కరోనా విజృంభిస్తున్న సమయంలో ఇళ్లకు పరిమితం కాకుండా వెకేషన్‌ను వెళ్లి కరోనాను వెంట తెచ్చుకుంది ఓ యువతరం బ్యాచ్. వివరాల్లోకి వెళితే.. టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నరగానికి చెందిన 28 మంది కుర్రకారు బ్యాచ్ మెక్సికోలోని కాబో శాన్ లూకాస్ ప్రాంతానికి స్ప్రింగ్ బ్రేక్ వెకేషన్ కోసం వెళ్లారు. అసలే ఆ ప్రాంతంలో కరోనా కమ్ముకొని ఉంది. ఈ విషయం తెలియని యవత తిరిగి అమెరికా రాగానే కరోనా టెస్టులు చేయటంలో అందరికీ పాజిటివ్ అని తేలింది. వారంతా ఇప్పుడు క్వరెంటైన్ చేయబడ్డారు.
అమెరికాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు కరోనా వైరస్ కేసుల్లో అమెరికాదే అగ్రస్థానం. అగ్రరాజ్యంలో ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువలో ఉంది. మరికొద్ది రోజుల్లోనే ఈ సంఖ్య 2 లక్షలను దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో ఇంత జరుగుతున్నప్పటీ పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను పాటించడం లేదు, ప్రజలు తమకు తామే స్వచ్ఛందంగా ఇళ్లకు పరిమితవుతున్నారు. న్యూయార్క్ నగరంలో అత్యధిక కరోనా కేసులు, మరణాలు రికార్డు అయ్యాయి.
కరోనా ధాటికి అమెరికాలో నిన్న ఒక్కరోజే 865 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం సాయంత్రం నాటికి అమెరికాలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 3,873కు చేరింది. అమెరికాలో కరోనా సంఖ్య సోకిన వారి సంఖ్య 1,88,172కు చేరింది. కరోనా వలన మరణాలు రికార్డు అయిన ఇటలీ, స్పెయిన్‌ల దేశాలకంటే కూడా అమెరికాలోనే అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులున్నాయి. దేశవ్యాప్తంగా లాక్డౌన్ పాటించడంలో అమెరికా పూర్తిస్థాయిలో విఫలమైందునే అక్కడ కరోనా తీవ్రత ఇంత అధికంగా ఉంది.