ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి ఒక్కసారిగా విరుచుకుపడింది. ఢిల్లీ మర్కజ్ నుంచి వచ్చిన వారి వల్ల కరోనా ఎక్కువగా వ్యాపిస్తుందని గుర్తించిన అధికారులు, వారందరినీ వెతికిపట్టి పరీక్షలు చేయడంతో కరోనా కేసులు భారీగా పెరిగా. నిన్న రాత్రి 9 గంటల నుంచి ఇప్పటి వరకూ కొత్తగా 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 87కి చేరుకుంది. గడచిన రాత్రి నుంచి 373 శాంపిళ్లను పరీక్షంచగా, వాటిలో 43 కరోనా పాజిటివ్ పాటివ్ అని తేలాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ కేవలం ఇద్దరు మాత్రమే కరోనా నుంచి కోలుకోగా, ఇంతవరకూ ఎలాంటి కరోనా మరణాలు రికార్డు కాలేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.