దిగొచ్చిన గ్యాస్ ధరలు

లాక్‌డౌన్ సమయంలో మధ్యతరగతి ప్రజలకు తీపికబురు చెప్పింది కేంద్ర సర్కారు. గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. సబ్సీడియేతర ఎల్‌పీజీ సిలిండర్ (14.2కేజీలు)పై రూ.61.5 మేర తగ్గిస్తూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) నిర్ణయం తీసుకుంది.

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాజాగా తీసుకున్న గ్యాస్ ధరల తగ్గింపు నిర్ణయం ప్రజలకు కాస్తంత ఊరటను కలిగించనుంది.

కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు 55 శాతం మేర తగ్గిన నేపథ్యంలో సిలిండర్ ధర తగ్గించినట్టు బుధవారం ఐఓసీ ప్రకటించింది. ఈ కొత్త ధర ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి రానుంది.

ఈ తగ్గింపుతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ.744కు దిగొచ్చింది. ఇది వరకు సిలిండర్ ధర రూ.805.50 వద్ద ఉంది. కోల్‌కతాలో సిలిండర్ ధర రూ.744.5కు తగ్గింది. ముంబైలో సిలిండర్ ధర రూ.714.5కు తగ్గింది. చెన్నైలో గ్యాస్ సిలిండర్ ధర రూ.761.5కు దిగొచ్చింది. గతంలో ఈ ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు వరుసగా రూ.839.5గా, 776.5గా, రూ.826గా ఉండేవి.

కేవలం 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధర మాత్రమే కాకుండా 19 కేజీల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర కూడా తగ్గింది. ఈ రకం సిలిండర్లపై రూ.96 మేర తగ్గింది. దీంతో ఢిల్లీలో 19 కేజీల గ్యాస్ సిలిండర్ దర రూ.1381.5 నుంచి రూ.1285.5కు తగ్గగా, కోల్‌కతాలో ధర రూ.1348.5, ముంబైలో రూ.1234.5, చెన్నైలో రూ.1402 మేర తగ్గాయి.

gas

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s