ఫోన్‌పే కరోనా పాలసీ; రూ.156 మాత్రమే!

phone-pay-corona-policy (2)

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కొత్తగా మార్కెట్లో ఇప్పడు కరోనా పాలసీలు పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ కంపెనీ ఫోన్‌పే ఓ సరికొత్త కరోనా ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రముఖ బీమా కంపెనీ బజాజ్ అలయన్స్‌తో కలిసి ఫోన్‌పే ‘కరోనా పాలసీ’ని లాంచ్ చేసింది.

ఫోన్‌పే అప్లికేషన్ ద్వారానే ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు. కేవలం రూ.156 లకే ఈ పాలసీ లభిస్తుంది. ఈ పాలసీ ద్వారా రూ.50,000 వరకూ కవరేజ్ ఉంటుంది. పాలసీ కొనుగోలు చేసిన 15 రోజుల తర్వాత, పాలసీదారునికి కరోనా లక్షణాలు కనిపించినా, కరోనా పాజిటివ్ అని తేలినా ఈ పాలసీ సాయంతో వైద్యానికి అయ్యే ఖర్చులను కవర్ చేసుకోవచ్చు.

కరోనా పాజిటివ్ అని తేలిన తక్షణమే ఈ పాలసీని కొనుగోలు చేస్తే అది, కంపెనీ నియమాల ప్రకారం బీమా వర్తించదు, కాబట్టి ఈ పాలసీని ముందస్తుగానే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ కరోనా పాలసీకి వయో పరిమితి కూడా ఉంది, ఇది కేవలం 55 ఏళ్ల లోపు ఉన్న వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుంది. ఆపై వయస్సు ఉన్న వారు ఈ పాలసీకి అనర్హులు.

phone-pay-corona-policy (1)

క్లినికల్ హెల్త్‌కేర్ కరోనా పాలసీ:
మరోవైపు క్లినిక్ హెల్త్‌కేర్ అనే సంస్థ కూడా కరోనా వైరస్ వ్యాధికి సమగ్రమైన ప్రొటెక్షన్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏడాదికి రూ.499 చెల్లించి ఈ పాలసీని పొందవచ్చు కరోనా వైరస్ సోకిన వారికి మాత్రమే ఈ పాలసీ వర్తిస్తుంది. ఈ పాలసీలో ప్రైమరీ కేర్, ఫైనాన్సియల్ ప్రొటెక్షన్ అనే రెండు లాభాలు పొందొచ్చు. కన్సల్టేషన్, 24 అవర్స్ డాక్టర్ అసిస్టెంట్, లక్ష రూపాయల వరకూ భీమా వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి. https://app.clinikk.com/ సైట్ ద్వారా ఈ పాలసీ కొనుగోలు చేయవచ్చు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s