ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు ఒక్కసారిగా భారీ సంఖ్యలో పెరిగాయి. గడచిన వారంలో కేవలం 8 కేసులు మాత్రమే ఉంటే, అవి ఇప్పుడు 132కు చేరుకున్నాయి. నిన్న ఒక్క రోజే 21 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో బుధవారం రాత్రి 111 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా, అవి కాస్తా గురువారం ఉదయానికల్లా 132కి చేరింది.
రాష్ట్రంలోనే మొట్టమొదటి కేసు నెల్లూరు జిల్లాలో నమోదు కాగా.. ఇప్పుడు 20 కేసులతో అది రాష్ట్రంలోనే అత్యధిక కేసులు కలిగిన జిల్లాగా మారింది. గుంటూరు జిల్లా కూడా కరోనా కేసుల్లో నెల్లూరుతో పోటీపడుతోంది. గుంటూరులో కూడా 20 కరోనా పాజిటివ్ కేసులను గుర్తించారు అధికారులు. ప్రకాశం జిల్లాలో 17, కడపలో, కృష్ణా జిల్లాల్లో 15 కేసులు రికార్డు అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్లో గురువారం ఉదయం నాటికి జిల్లాల వారీగా కేసుల సంఖ్య ఇలా ఉంది: