కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో కొనుగోళ్లు తగ్గడంతో బంగారం ధరలు వరుసగా నాలుగో రోజు కూడా తగ్గముఖం పట్టాయి. సప్లయ్ తక్కువగా ఉండటం వలన అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ, భారతదేశంలో మాత్రం ధరలు తగ్గుతుండటం గమనార్హం. స్వర్ణం ధరలు తగ్గుతుంటే వెండి ధరలకు మాత్రం రెక్కలొస్తున్నాయి. వెండి ధర కేజీపై రూ.460 పెరిగి రూ.39,940కు చేరుకుంది.
హైదరాబాద్ మార్కెట్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి:
గురువారం నాటికి హైదరాబాద్ మార్కెట్లో బంగారం 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ.70 తగ్గి రూ.39,510 నుంచి రూ.39,440కి చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములపై రూ.80 తగ్గి రూ.43,160 నుంచి రూ.43,080కి చేరింది.