చాలా మంది ప్రజలు కరోనా, లాక్డౌన్ తిరిగి రాకూడదని కోరుకుంటుంటే, యూపీలో మాత్రం కొందరు మరీ విడ్డూరంగా వాటిని ఇంట్లో పెట్టేసుకుంటాం అంటున్నారు. ఉత్తర ప్రదేశ్లోని డియోరియా జిల్లాలో జన్మించిన బాబుకు ‘లాక్డౌన్’ అనే పేరును పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కరోనా లాక్డౌన్ సమయంలో పుట్టడం వల్లనే ఆ పేరును పెట్టినట్లు చెబుతున్నారు.
కరోనా కష్టకాలం నుంచి ప్రజలను కాపాడేందుకు నరేంద్ర మోడీ చేస్తున్న లాక్డౌన్ చాలా ప్రశంసనీయమైనదని, ఈ లాక్డౌన్ వలన కరోనా మహమ్మారి నుంచి అనేక మంది ప్రజల ప్రాణాలు కాపాడబడుతున్నాయని, తమ బాబు కూడా భవిష్యత్తులో ప్రజలను కాపాడేవాడు కావాలని అందుకే అతడికి లాక్డౌన్ అనే పేరును పెట్టామని బాబు తండ్రి పవన్ చెప్పాడు.
వ్యక్తి భధ్రత కన్నా జాతి భధ్రతే ముఖ్యమని చెప్పడమే లాక్డౌన్ ముఖ్య ఉద్దేశ్యమని, తన బాబు పేరు తలచుకున్నప్పుడల్లా ఈ విషయం గుర్తుకు వస్తుందని ఆయన అన్నారు.
ఇదిలా ఉంటే, గడచిన వారం ఘోరక్పూర్ జనతా కర్ఫ్యూ రోజను జన్మించిన ఓ అమ్మాయి ‘కరోనా’ అనే పేరును పెట్టాడు ఆ అమ్మాయి మేనమామ. కరోనా వైరస్ను ప్రపంచం మొత్తం ఏకతాటిపై నడుస్తూ సమైఖ్యమైందని, తన మేనకోడలు కూడా ఇలా ప్రపంచాన్ని సంఘటితం చేయాలనే ఉద్దేశ్యంతోనే కరోనా పేరును పెట్టామని నితేష్ త్రిపాఠి చెప్పారు.
ఏదేమైనప్పటికీ, కరోనా సీజన్లో పుట్టిన ఈ పిల్లలు ఇద్దరూ పెద్దయ్యాక తమ పేర్లను మార్చుకుంటారో లేక ఇలాంటి పేర్లను పెట్టినందుకు పెద్దవాళ్లను నిందిస్తారో వేచి చూడాలి.