భారత్లో ఐఫోన్ల ధరలు మరోసారి పెరిగాయి. గడచిన రెండు నెలల్లో ఐఫోన్ ధరలు పెరగడం ఇది రెండోసారి. గతంలో దిగుమతి సుంఖాల పెరగుదల కారణంగా ఐఫోన్ ధరలను పెంచగా, తాజాగా గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (జిఎస్టి)లో పెరుగుదల కారణంగా 5 శాతం మేర ధరలను పెంచుతున్న యాపిల్ సంస్థ ప్రకటించింది.
ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఐఫోన్ ధరలు ఇలా ఉన్నాయి:
ఐఫోన్ ఎక్స్ఆర్ (64 జిబి) – రూ.52,500 (రూ.2,600 పెరిగింది)
ఐఫోన్ 11 ప్రో (64 జిబి) – రూ.1,06,600 (రూ.5,400 పెరిగింది)
ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ (64 జిబి) – రూ.1,17,100 (రూ.5,900 పెరిగింది)
ఐఫోన్ 7 (32 జిబి) – రూ.31,500 (రూ.1,600 పెరిగింది)