కరోనా కేసుల్లో నిజాలు దాస్తున్న ఏపీ సర్కార్: బాబు

రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో, ఈ విషయాన్ని తేలికగా తీసుకోకూడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్రంలో కరోనా టెస్టింగ్ ల్యాబ్‌లను పెంచడమే అధిక సంఖ్యలో టెస్టింగ్స్ చేయగలిగితేనే ఈ సమస్య నుంచి గట్టెక్కగలమని సూచించారు. ఈ మేరకు సీఎం జగన్‌కు చంద్రబాబు మూడు పేజీల లేఖ రాశారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కేవలం నాలుగు కరోనా టెస్టింగ్ ల్యాబ్స్ మాత్రమే ఉన్నాయి. ఈ ల్యాబ్స్ ద్వారా ఇప్పటి వరకు 1,307 మందికి కరోనా టెస్టులు చేశారు. ఇదే విషయాన్ని తప్పుబట్టారు చంద్రబాబు, ఏపీలో అధిక సంఖ్యలో పరీక్షలు చేయటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మహారాష్ట్రలో 6,323, కేరళలో 7,965, రాజస్థాన్‌లో 6,530, కర్ణాటకలో 3,799, తమిళనాడులో 2,796 పరీక్షలు చేస్తే రాష్ట్రంలో ఆ సంఖ్య తక్కువగా ఉండటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

కరోనా కేసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు విడుదల చేసే హెల్త్‌ బులెటిన్లు పూర్తి పాదర్శకంగా ఉండాలని, పాజిటివ్‌ కేసులను దాచిపెట్టడంతో పాటు తక్కువ లెక్కలు చెబుతున్నారనే ప్రచారం ఇప్పటికే ప్రజల్లో ఉందని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంలో ఎప్పటికప్పుడు నిజాలు వెల్లడిస్తూ ప్రజలను మరింత అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

కరోనా వైరస్ విషయంలో నిజాలు దాచిపెడితే అది పెనుప్రమాదంగా మారుతుందని చంద్రబాబు హెచ్చరించారు. మరోవైపు కరోనా క్రైసిస్ పేరిట ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది వేతనాల్లో కోత విధించొద్దని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వేతనాలు వాయిదా వేయడం అంత మంచిది కాదని అన్నారు. ఇలాంటి కష్టకాలంలో ప్రజలను కాపాడుతున్న వైద్య ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు ఇప్పటికే పలు రాష్ట్రాలు వివిధ ప్రోత్సాహకాలు అందిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లింపులకు అడ్డురాని కరోనా, ప్రభుత్వ ఉద్యోగుల జీతాల దగ్గరకు వచ్చేసరికి అడ్డుగా మారిందా అంటూ ఉద్యోగులు అవేదన చెందుతున్నారనే విషయాన్ని బాబు తన లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా.. కరోనా లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రంలో లక్షలాది మంది రైతుకూలీలు, వివిధ రంగాలకు చెందిన కార్మికులు ఉపాధి కోల్పోయారని, ఇలాంటి పరిస్థితుల్లో పేదలను పస్తులు ఉంచకుండా, రాష్ట్రంలో గత 11 నెలలుగా మూతబడిన ‘‘అన్నా క్యాంటీన్లు ’’ను వెంటనే పునఃప్రారంభంచాలని, తెలంగాణలో జిహెచ్ఎంసి ‘‘అన్నపూర్ణ కేంటిన్ల’’ ద్వారా హైదరాబాద్ లో పేదలకు ఉచితంగా ఆహారాన్ని అందిస్తున్న విషయం గుర్తుంచుకోవాలని తన లేఖలో సూచించారు.

cbn-namasthe

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s