కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ నిర్వహిస్తున్న నేపథ్యంలో, మహిళలు చాలా వరకూ ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసినేదే. ఈ తరుణంలో గృహిణులు తమ స్నేహితురాళ్లకు ఓ కొత్త ఛాలెంజ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ‘ట్రెడిషనల్ ఛాలెంజ్’ పేరిట ఓ కొత్త ఛాలెంజ్ బాగా పాపులర్ అయ్యింది.
ఈ ఛాలెంజ్లో భాగంగా మహిళలంతా సాంప్రదాయ దుస్తుల్లో ఫొటో తీసుకొని ఫేస్బుక్ వంటి సామాజిక మాద్యమాల్లో అప్లోడ్ చేయాలి, ఇలా అప్లోడ్ చేసిన వారు తిరిగి తమ ఫ్రెండ్లిస్ట్లో ఎవరో ఒకరికి ఛాలెంజ్ విసరాల్సి ఉంటుంది. ఈ ఛాలెంజ్లో చీరకట్టు, లంగా, ఓణి మొదలైన సాంప్రదాయ దుస్తులు ధరించాలి, అంతా క్లాసిక్గానే ఉండాలి, మోడ్రన్ సొబగులు ఉండకూడదు.
ట్రెడిషనల్ ఛాలెంజ్ చేస్తూనే, మహిళలు ఇళ్లకే పరిమితం కావాలంటూ సూచనలు కూడా చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ, ఈ ఛాలెంజ్ వినటానికి భలేగానే ఉన్నప్పటికీ, మహిళలు తమ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేసేటప్పుడు ప్రైవసీ అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని టెక్ నిపుణులు చెబుతున్నారు.