ఓవరాక్షన్ చేసిన కానిస్టేబుల్ సస్పెండ్!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యిన ఫైటింగ్ వీడియో..
కేటీఆర్ జోక్యంతో రంగంలోకి దిగిన డిజిపి, ఎస్పీ..
బాధితుల్ని పరామర్శించిన వనపర్తి ఎస్పీ అపూర్వ రావు..

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో, ప్రజలను కట్టడి చేసేందుకు పోలీస్ యంత్రాంగం సర్వశక్తులా ప్రయత్నిస్తోంది. అయితే, కొన్ని ప్రాంతాల్లో మాత్రం పోలీసుల ఓవరాక్షన్ అక్కడక్కడా కనిపిస్తూనే ఉంది. తాజాగా వనపర్తిలో జరిగిన ఓ సంఘటన మంత్రి కేటీఆర్ వరకూ వెళ్లింది.

వివరాల్లోకి వెళితే.. వనపర్తి జిల్లా కేంద్రంలో లాక్‌‌డౌన్‌ విధుల్లో ఉన్న పోలీస్‌ కానిస్టేబుల్‌ ఓ స్థానికుడిపై దాడి చేశాడు. ఆ సమయంలో సదరు వ్యక్తి తన కుమారుడు కూడా ఉన్నాడు. ఈ సమయంలో బైక్‌పై పిల్లలను ఎక్కడికి తీసుకు వెళ్తున్నావంటూ ప్రారంభమైన గొడవ తీవ్ర రూపం దాల్చింది. బైక్‌పై కేసులున్నాయని, వెంటనే చెల్లించకపోతే సీజ్ చేస్తామని చెప్పడం, సదరు వ్యక్తి బైక్ తాళం చెవులు ఇవ్వకపోవటంతో అతనిని క్రింద పడేసి మరీ కొట్టాడు వనపర్తి కానిస్టేబుల్.

అంకుల్ నాన్నను కొట్టొద్దు అంకుల్. .ప్లీజ్ అంకుల్.. అంటూ ఆ బాబు అరుస్తున్నప్పటికీ చుట్టు ప్రక్కల ఉన్న పోలీసులకు ఎలాంటి కనికరం కలగలేదు. క్రింద పడేసి కాళ్లతో, కర్రలతో కొడుతూనే ఉండిపోయారు. అనంతరం ఇద్దరినీ జీపులో ఎక్కించుకొని జైలుకు తీసుకెళ్లారు, అక్కడ కూడా ఆ వ్యక్తిని పోలీసులు కొట్టారు. ఇదంతా చుట్టు ప్రక్కల ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయటంతో అది కాస్తా కేటీఆర్ సార్ వరకూ చేరింది.

దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్‌ సదరు కానిస్టేబుల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని హోం మంత్రిని, డీజీపీని కోరారు. ఈ కేసును వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వ రావుని విచారించాల్సిందిగా ఆదేశించారు. దీంతో స్థానికులపై ఓవరాక్షన్ చేసిన కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఎస్పీ ప్రకటించారు. కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసిన విషయాన్ని మంత్రి కేటీఆర్‌, డీజీపీ లకు వనపర్తి ఎస్పీ అపూర్వ రావు ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. అంతేకాకుండా ఆమె స్వయంగా బాధిత కుటుంబాన్ని కలసి పరామర్శించారు. ఇప్పుడు ఆ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

SP

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s