రేషన్ కార్డు ఉంటేనే రూ.1,000

కరోనా కారణంగా కొనసాగిస్తున్న లాక్‌డౌన్ నేపథ్యంలో, ఉపాధి కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు ఇంటికి రూ.1,000 చొప్పున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన ఆర్థిక సాయాన్ని వాలంటీర్లు పంపిణీ చేయటం ప్రారంభించారు. రాష్ట్రంలో బియ్యం కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ ఆర్థిక సాయం అందనుంది.

రాష్ట్రంలో 1 కోటి 30 లక్షల కుటుంబాలు ఈ ఆర్థిక సాయానికి నోచుకోనున్నాయి. ఒకవేళ ఎవరైనా అర్హులు ఉండి తమ వద్ద బియ్యం కార్డు లేకున్నట్లయితే, అలాంటి వారు వెంటనే గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అదికారులు సూచిస్తున్నారు. వారి అర్హత పరిశీలించిన అనంతరం అర్హతను బట్టి కొత్త వారికి కూడా రూ.1,000 సాయం అందిస్తారు.

కరోనా లాక్‍‌డౌన్ కారణంగా దారిద్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో సీఎం జగన్ అర్హులైన కుటుంబాలకు రూ.1,000 ఆర్థిక సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసినదే. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1300 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ సాయాన్ని గ్రామ వాలంటీర్లే నేరుగా ప్రజల ఇంటికి చేరుస్తారు.

cash-donation

One thought on “రేషన్ కార్డు ఉంటేనే రూ.1,000

  1. If some one desires to be updated with most recent
    technologies therefore he must be visit this site and
    be up to date all the time.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s