అదృష్టం.. ఆ బాబుకు కరోనా లేదు

ఆమె ఓ నిండు గర్భిణీ, ఆమె భర్త కరోనా పేషెంట్లకు వైద్యం అందిస్తున్న డాక్టర్. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న తరుణంలో ఆ డాక్టర్‌కు కూడా కరోనా వైరస్ సోకింది. ఆ వైరస్ కాస్తా డాక్టర్ ఇంట్లో ఉన్న గర్భిణీ భార్యకు సోకింది. సదరు ఢిల్లీ ఎయిమ్స్ ఆస్ప‌త్రిలో శుక్ర‌వారం రాత్రి ప్ర‌స‌వించి పండంటి మగ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది.

అదృష్టవశాత్తూ ఆ బాబుకు కరోనా సోకలేదు. త‌న‌కు క‌రోనా ఉండ‌డంతో తన బిడ్డ‌కు కూడా కరోనా వైర‌స్ సోకుతుందేమోన‌ని సదరు మ‌హిళ ఆందోళ‌న చెందుతుంటే, వైద్యులు ఆమెకు గుడ్ న్యూస్ చెప్పారు. చిన్నారికి క‌రోనా లేద‌ని డాక్ట‌ర్లు చెప్ప‌డంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి ఆకాశమే హద్దయ్యింది.

ఆమె భర్త ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో రెసిడెంట్ డాక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఆయ‌న‌కు క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో ఐసోలేష‌న్ వార్డులో చేరాడు. ఆ తర్వాత భార్యకు పరీక్షలు నిర్వహించగా ఆమెకు కూడా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరూ ఐసోలేషన్‌లో ఉన్నారు.

ఇకపోతే బాబును ప్రత్యేక గదిలో ఉంచారు. కరోనా నుంచి కోలుకోగానే తల్లిదండ్రులకు ఆ బాబును అప్పగిస్తారు. ఈ నేపథ్యంలో ఆ బాబుకు తల్లి నుంచి సేకరించిన చనుబాలను ఆహారంగా ఇస్తున్నారు. తల్లి చ‌నుబాలు ఇవ్వటం ద్వారా బాబుకు కరోనా వైర‌స్ సోకే ముప్పు లేదని ఎయిమ్స్ మెడిక‌ల్ సూరింటెండెంట్ డాక్ట‌ర్ డీకే శ‌ర్మ చెప్పారు.

corona-baby

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s