అమెరికాలో అలజడి: 24 గంటల్లో 1480 మంది మృతి

అగ్రరాజ్యంలో కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యంలో చైనా, ఇటలీ, స్పెయిన్ దేశాలను సైతం అమెరికా అధిగమించింది. శుక్రవారం నాటికి అమెరికాలో కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 277,161కి చేరింది. ఇకపోతే, ఇప్పటి వరకూ ఆ దేశంలో 7,392 కరోనాకు బలయ్యారు. దేశవ్యాప్తంగా 12,283 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అమెరికాలో కేవలం 24 గంటల్లోనే 1,480 మంది కరోనాతో చనిపోయారు.

అమెరికాలో అత్యధికంగా న్యూయార్క్ నగరంలో 93,053 పాజిటివ్ కేసులు, 2,538 మరణాలు నమోదయ్యాయి. అసలే రద్దీగా ఉండే న్యూయార్క్ నగరంలో కరోనాను కట్టడి చేయటంలో అమెరికా పూర్తిస్థాయిలో విఫలమైందనే చెప్పాలి, నానాటికీ పెరుగుతున్న కరోనా కేసులను కంట్రోల్ చేయలేక న్యూయార్క్ అధికారులు చేతులెత్తేస్తున్నారు. అక్కడ పూర్తిస్థాయి సంక్షోభం నెలకొంది.

న్యూయార్క్‌లో కరోనాతో చనిపోతున్న వారి అంత్యక్రియలు చేసేందుకు స్థలం లేక మృతదేహాలను మార్చురీలో ఉంచాల్సి వస్తోంది. కేవలం న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్ మెట్రోపాలిటన్ ప్రాంతాల్లోనే చైనా కంటే ఎక్కువగా 1,20,000 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయంటే అక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఓవైపు అమెరికా మాంద్యం పరిస్థితులు కూడా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే వేలాది మంది అమెరికన్లు ఉద్యోగాలను పోగొట్టుకొని రోడ్డున పడ్డారు. మరోవైపు నిత్యావసర వస్తువులకు సైతం కొరత ఏర్పడుతోంది. ఇంత జరుగుతన్నప్పటికీ అమెరికాలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను పాటించకపోవటంతో ప్రెసిడెంట్ ట్రంప్‌పై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తున్నాయి.

corna-usa

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s