గుండె జబ్బుల బారిన పడకుండాలంటే ఉండే వేడి నీళ్లతో స్నాయం చేయాలని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. జపాన్‌లో నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వైల్లడైంది. జపాన్‌లో 30 వేల మందిపై 20 ఏళ్లపాటు నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం, నిత్యం వేడి నేడితో స్నానం చేసే వారికి గుండె జబ్బులు, పక్షవాతం వంటి సమస్యలు వచ్చే అవకాశం లేదని తేలింది.
చల్లటి నీళ్లతో స్నానం చేసే వారితో పోల్చుకుంటే వేడి వేడి నీటితో స్నానం చేసే వారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం 28 శాతం తక్కువగా ఉందని, అలాగే గుండె పోటు వచ్చే అవకాశం 26 శాతం తక్కువగా ఉందని ఈ అధ్యయనంలో పేర్కొన్నారు. గుండెను జబ్బుల బారి నుండి కాపాడుకునేందుకు ఇది చాలా చవకైన మార్గమని తెలిపారు. జపాన్‌లోని జర్నల్ హార్ట్‌లో పబ్లిష్ అయిన రీసెర్చ్‌లో ఈ విషయాన్ని పేర్కొన్నారు.