కరోనా వైరస్ నేపథ్యంలో ఓ బుజ్జి బాబు చెప్పిన ఈ పద్యం వినండి. కరోనా మహమ్మారి గురించి ఇంత క్యూట్‌గా కూడా ప్రజల్లో అవగాహన తీసుకురావచ్చని ఈ వీడియో చూసాకే అర్థమయ్యింది.
కరోనా వైరస్ వచ్చింది.. దూరం దూరం జరగండి..
చేతులు బాగా కడగండి.. ఇళ్లలోనే ఉండండి..
రోడ్లపైకి రావద్దు.. రోగాన్నింకా పెంచొద్దు..
ఇటలీలాగా మార్చొద్దు.. లక్షణరేఖను దాటొద్దు..
చైనా నుండి వచ్చింది.. ప్రపంచమంతా పాకింది..
నాకేం మందు లేదంది.. నిర్లక్ష్యమే నా బలమంది..
మోదీ మాటను వినండి.. ఇరవై రోజులు ఆగండి..
దేశభక్తిని చాటండి.. ఆనందంగా ఉండండి..