కరోనా నిర్ధారణ కోసం క్వరెంటైన్ చేసిన నిజాముద్దీన్ తబ్లిగి జమాత్ సభ్యులకు చికిత్స అందిచడం కోసం ఐసోలేషన్ వార్డులలో ఉంచితే, వారు మాత్రం అక్కడున్న మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఈమేరకు వారిపై అసభ్య ప్రవర్తన, ప్రభుత్వ సిబ్బందికి సహకరించకపోవటం తదితర ఆరోపణలపై కొందరు తబ్లిగి జమాత్ సభ్యులపై కేసు నమోదు చేసినట్టు ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు తెలిపారు.
ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మర్కజ్‌కు హాజరైన వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ఉత్తర్‌ప్రదేశ్, ఘజియాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో క్వరెంటైన్ చేశారు. కానీ అక్కడున్న కొందరు ఆస్పత్రి సిబ్బందికి సహకరించకపోగా, ఐసొలేషన్ వార్డు పరసరాల్లో నగ్నంగా తిరగుతూ మహిళా సిబ్బందిని దుర్భాషలాడుతున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వివరించారు.
అంతేకాకుండా మద్యం, పొగాకు, సిగరెట్లు కావాలంటూ డిమాండ్ చేయటం, గట్టిగా కేకలు వేయటంతో ఆస్పత్రి సిబ్బంది చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం విషయాన్ని చీఫ్ మెడికల్ ఆఫీసర్, జిల్లా ఎస్పీ, మేజిస్ట్రేట్ల దృష్టికి లిఖిత పూర్వకంగా తీసుకెళ్లారు. కొందరు తబ్లిగి సభ్యులపై తీవ్ర ఆరోపణలు వచ్చాయని ఘజియాబాద్ ఎస్పీ కళానిధి నైతాని తెలిపారు.
స్త్రీల పట్ల అవమానకర, అసభ్యకర ప్రవర్తన, అంటువ్యాధులు వ్యాప్తించేలా ప్రవర్తించి ఇతరుల ప్రాణాలకు హానికి కలిగించటం వంటి నేరాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు కారణమైన ఏ ఒక్కరీని విడిచిపెట్టమని, ఇలాంటి దుష్ప్రవర్తనను సహించబోమని, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.