కరోనాపై పోరులో భాగంగా ఇవాళ రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు ఇళ్లలోని లైట్లను ఆర్పేసి, దీపాలు లేదా ఫ్లాష్లైట్లను వెలిగించాలని తద్వారా కరోనా చీకట్లను తరిమికొట్టాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రజలకు కొన్ని సూచనలు చేసింది.
దీపాలు వెలిగించేటప్పుడు ప్రజలెవ్వరూ శానిటైజర్లను ఉపయోగించవద్దని సూచించారు. శానిటైజర్లో ఉండే ఆల్కహాల్ మంటను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున దీపాలను వెలిగించేటప్పుడు చేతులకు శానిటైజర్‌ను అప్లయ్ చేయవద్దని చెప్పారు. అంతేకాకుండా దీపాల వెలిగించే నెపంతో ప్రజలందరూ బయట గుమిగూడి వద్దని, సామాజిక దూరం పాటించాలని తెలిపారు.
దేశంలోని ప్రజలంతా ఇలా లైట్లను ఆపేయడం వలన విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగి ఆ భారమంతా పవర్ గ్రిడ్‌పై పడుతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో, ప్రజలు ఇళ్లలో కేవలం లైట్లను మాత్రమే ఆపేయాలని, ఫ్రిడ్జ్‌లు, ఫ్యాన్లు, ఏసిలు, కూలర్లు మొదలైన ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఆపవద్దని అధికారులు సూచించారు.
What about this #stupidity pic.twitter.com/182DpDKtPZ
— sanjesh sharma (@sanjeshsharma3) April 6, 2020
https://platform.twitter.com/widgets.js
మరోవైపు ఎమర్జెన్సీ సేవల వద్ద, ఆస్పత్రులు మరియు క్వరెంటైన్ సెంటర్లలోను అలాగే జాతీయ రహదారులపై లైట్లను యధాతథంగా వెలిగించాలని అధికారులు.