అగ్రరాజ్యంలో కరోనా మహమ్మారి కట్టలు తెంచుకుంది. అమెరికాలో కరోనా మృతులు రోజు రోజుకీ భారీగా పెరుగుతున్నాయి. తాజాగా.. అమెరికాలో భారతదేశానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయాయి.
ది ఫెడరేషన్ ఆఫ్ కేరళ అసోసియేషన్స్ ఇన్ నార్త్ అమెరికా (ఫోకానా) తెలిపిన వివరాల ప్రకారం, అలేయమ్మ కురియాకోస్ (65), థనకచన్ ఎంచెనట్టు (51), అబ్రహం శామ్యూల్ (45), షవన్ అబ్రహం (21) కరోనా వైరస్ కారణంగా మృతి చెందారు. మృతుల కుటుంబాలకు ఫోకానా సంఘం తన ప్రగాఢ సానుభూతి తెలియజేసింది.
అమెరికాలో ఇప్పటి వరకూ 3,37,797 మందికి కరోనా సోకగా, ఇందులో కేవలం 17,644 మంది మాత్రమే రికవరీ అయ్యారు. కాగా.. ఇప్పటి వరకూ అమెరికాలో 9,670 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.