నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగడం, కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించిన నేపథ్యంలో నగరంలోని అన్ని మాంసపు దుకాణాలను మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రజలు సామాజిక దూరం (సోషల్ డిస్టెన్స్) పాటించ కుండా చికెన్ షాపుల ముందు గుమిగూడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రతి ఆదివారం నాడు మాంసపు దుకాణాలను మూసివేసేందుకు ఆదేశాలు జారీ చేసామని, సోమవారం నుంచి శనివారం వరకూ మాంసపు విక్రయదారులు యధావిధిగా అమ్మకాలు కొనసాగించవచ్చని, కాకపోతే సామాజిక దూరం పాటించకుండా ఎవరైనా విక్రయాలు జరిపే సదరు దుకాణాలపై భారీ జరిమానా విధించి, సరుకును జప్తు చేస్తామని నగర పాలక సంస్థ కమిషనర్ పివివిస్ మూర్తి తెలిపారు.
మాంసపు సామాజిక దూరం పాటించడం లేదంటూ వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు సూచనల మేరకు ఈ ఆదేశాలను పటిష్టంగా అమలు చేస్తామని మూర్తి తెలిపారు. ఇలా వరుసగా రానున్న మూడు ఆదివారాలలో మాంసపు దుకాణాలు మూసివేయబడుతాయని అన్నారు. అయితే, ఈ నిబంధన కొనసాగింపు అనేది తదుపరి నిబంధనలపై ఆధారపడి ఉంటాయన్నారు.