ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల సోదరి శ్రీ లక్ష్మి కనకాల ఈ రోజు అనారోగ్యంతో కన్నుమూసారు. గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న శ్రీలక్ష్మి సోమవారం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. శ్రీలక్ష్మి మరణంతో రాజీవ్ కనకాల ఇంట విషాదం నెలకొంది.
ప్రముఖ నటుడు దేవదాసు, లక్ష్మీ కనకాల ఏకైక కుమార్తె శ్రీలక్ష్మి కనకాల. ఆమె భర్త ప్రముఖ జర్నలిస్టు పెద్ద రామారావు, ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శ్రీలక్ష్మీ పలు టీవీ సీరియల్స్‌లో నటింటి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది ఆగష్టు నెలలో రాజీవ్ కనకాల తండ్రి దేవదాసు కనకాల కూడా మరణించిన సంగతి తెలిసినదే. శ్రీలక్ష్మి కనకాల మరణం పట్ల పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.