బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌కు కరోనా సోకిన విషయం తెలిసినదే. కాగా.. ఇప్పటి వరకూ ఇంటిలోనే స్వీయ నిర్బంధంలో ఉన్న బోరిస్ జాన్సన్‌ను ఇప్పుడు ఐసీయూకు తరలించారు. గత వారంగా ఆయన ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తున్న నేపథ్యంలో ఐసీయూలో ఉంచి చికిత్స చేయించాలని వైద్యులు నిర్ణయించారు.
‘ప్రధానమంత్రి గత పది రోజులుగా కరోనా లక్షణాలతో హోం క్వారంటైన్లో ఉన్నారు. కరోనా తగ్గుముఖం పట్టక పోవడంతో ముందుజాగ్రత్త చర్యగా అతన్ని ఆసుపత్రికి తరలించామ’ని డౌనింగ్ స్ట్రీట్ అధికారులు చెప్పారు. ప్రస్తుతం బోరిస్ జాక్సన్ వయసు 55 ఏళ్లు, ఆయన సతీమణ ఇప్పుడు గర్భంతో ఉంది.
కరోనా రోగులను పర్యవేక్షించేందుకు ఆయన ఇదివరకు బ్రిటన్‌లో కొన్ని ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. ఈనేపథ్యంలోనే జాక్సన్‌కు కరోనా సోకి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. జాక్సన్‌తో టచ్‌లో ఉన్న అధికారులంతా ఇప్పుడు సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నారు. కాగా.. యూకే ఇప్పటికే కరోనా రోగుల సంఖ్య 51 వేలను దాటగా, 5,373 మంది కరోనాతో మరణించినట్లు లెక్కలు చెబుతున్నాయి.
కాగా.. బ్రిటన్ ప్రధాని ఐసీయూలో చేరటంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విచారం వ్యక్తం చేశారు. బోరిస్ త్వరగా కోలుకోవాలని ప్రార్థన చేస్తున్నట్లు చెప్పారు.