ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ట్యాగ్‌లైన్‌తో గతేడాది సంక్రాంతికి విడుదలై తెలుగు ప్రేక్షకులను అలరించిన చిత్రం ఎఫ్2 (F2)కి సీక్వెన్స్ విడుదలయ్యే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్న సంగతి మనకు తెలిసినదే. ఎఫ్3 (F3) పేరుతో రాబోయే ఈ చిత్రం ట్యాగ్‌లైన్ ఫన్, ఫ్యామిలీ అండ్ ఫ్రస్ట్రేషన్ అని ఉండొచ్చని భావిస్తున్నారు.
తన మార్క్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనీల్ రావిపూడి ఎఫ్3లో ఆ కామెడీ డోస్‌ను మరింత పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. లాక్డౌన్ నేపథ్యంలో షూటింగ్‌లు లేక ఇంటికే పరిమితమైన అనీల్ ఇప్పుడు తన రైటింగ్ టీమ్‌తో కలిసి ఎఫ్3 స్క్రిప్టును రెడీ చేసే పనిలో పడ్డట్లు తెలుస్తోంది.
ఎఫ్3లో మరింత ఫన్ క్రియేట్ అయ్యేలా డైలాగ్స్ ఉండబోతున్నాయని సమాచారం. ఎఫ్2 చిత్రంలో విక్టరీ వెంకటేషన్, వరుణ్ బాబులు హీరోలుగా నటించిన సంగతి తెలిసినదే. అయితే, ఎఫ్3లో మూడవ హీరో కూడా ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మూడవ హీరో ఎవరన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.