ఢిల్లీనుంచి పారిపోయిన ఆరుగురు మలేషియా వాసులను హైదరాబాద్‌లో దాక్కున్నట్లు గుర్తించారు. తబ్లిగి జమాత్‌కు హాజరై, ఢిల్లీ నుంచి పారిపోయిన వీరిని రాజధానిలో గుర్తించారు పోలీసులు. ఆరుగురు మలేషియన్లపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
మలేషియాకు చెందిన హమీద్‌బిన్ జేహెచ్ గుజిలి, జెహ్రాతులామని గుజాలి, వారామద్ అల్ బక్రి వాంగ్, ఏబీడీ మన్నన్ జమాన్ బింతి అహ్మద్, ఖైరిలి అన్వర్ బాన్ అబ్దుల్ రహీం, జైనారియా టూరిస్ట్ వీసాపై ఇండియాకు వచ్చి న్యూఢిల్లీలో జరిగిన తబ్లీగి జమాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆ తర్వాత వీరంతా మలేషియా వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే కరోనా వైరస్ విజృంభిస్తుండటం, లాక్‌డౌన్‌ను ప్రకటించడంతో అంతర్జాతీయ రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ ఆరుగురు న్యూఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్‌కు చేరుకుని హకీంపేట మసీదులో తలదాచుకున్నారు. దీంతో వారికి ఆశ్రయిమిచ్చిన మసీదు ఇన్ ఛార్జ్ పై క్రిమినల్ కేసు నమోదు చేశారు.
కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో, ఢిల్లీ మర్కజ్‌కు హాజరైన వారిని గుర్తించేందుకు పోలీసులు గాలింపులు చేపట్టడంతో వీరు బయటపడ్డారు. వీరిపై ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్‌తో పాటు ఐపీసీ సెక్షన్ 420, 269, 270, 188, 109, ఫారెనర్స్ యాక్ట్ కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి గాంధీ ఆస్పత్రికి తరలించి క్వారంటైన్లో ఉంచారు.