వయస్సుతో సంబంధం లేకుండా కరోనా ప్రజలను బలితీసుకుంటుంది. తాజాగా.. కరోనా మహమ్మారికి 14 నెలల శిశువు బలయ్యాడు. ఈ విచారకర సంఘటన గుజరాత్లో చోటు చేసుకుంది. కోవిడ్-19 వ్యాధితో 14 నెలల శిశువు చనిపోయినట్లు వైద్యాధికారులు తెలిపారు.
గుజరాత్‌లోని జామ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా లక్షణాలతో చేరి, చికిత్స పొందుతున్న సమయంలో ఆ శిశువు మరణించినట్లు అధికారులు చెప్పారు. ఏప్రిల్ 5న చేసిన కరోనా టెస్టుల్లో ఆ పసికందుకు కరోనా పాజిటివ్ వచ్చింది, అప్పటి నుంచి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.
ఈ క్రమంలో శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా మారడంతో ఆ శిశువు మంగళవారం రాత్రి కన్నుమూశాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ బాబుకు కరోనా ఎవరి ద్వారా సోకిందో తెలియలేదు. శిశువు తల్లిదండ్రులకు కరోనా టెస్టుల్లో నెగిటివ్ వచ్చింది, కానీ బాబుకు ఎలా వైరస్ సోకిందోనని తల్లిదండ్రులతో పాటు వైద్యులు కూడా ఆశ్చర్యపోతున్నారు.
చూశారా కదా మిత్రులారా.. బయట పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, దయచేసి మీరు కూడా ఇళ్లకే పరిమితమైన కరోనా వ్యాప్తిని అడ్డుకోండి.