ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో.. నేడు (బుధవారం) అల్లు అర్జున్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ చిత్ర టైటిల్‌ను, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఏపుగా ఎదిగిన జట్టు, గడ్డంతో అల్లు అర్జున్ ఈ సీన్లో ఊర మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి ‘పుష్ప’ (P U S H P A) అనే పేరును పెట్టారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో క్యూట్ గర్ల్ రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది.
గత ఏడాది అక్టోబర్ నెలలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుత లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది. లాక్‌డౌన్‌ను ఎత్తేసినట్లయితే, మేలో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో బన్నీ డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే ఇదివరకు రామ్ చరణ్ నటించిన రంగస్థలం చిత్రం మాదిరిగానే ఇదికూడా పీరియడ్ డ్రామాలా కనిపిస్తోంది. అళాగే.. టైటిల్లోని వేలిముద్రలు చూస్తుంటే, ఇదేదో సస్పెన్స్ థ్రిల్లర్‌లా కూడా అనిపిస్తోంది.
ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించనున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాగ్డ్రాప్, చిత్తూరు నేపథ్యంలో నడిచే సినిమా ఇది. పుష్ప చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ భాషలలో కూడా విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా పలు భాషల్లో విడుదల చేశారు. హ్యాపీ బర్త్‌డే అల్లు అర్జున్..!