అమెరికాలో నిన్న ఒక్కరోజే 1,845 మంది మృతి

అమెరికాలో కరోనా విళయ తాండవం చేస్తోంది. ఇటలీలో సంభవించిన కరోనా మరణాలను చూసి మన అయ్యో అనుకున్నాం, కానీ ఇప్పుడు అమెరికాలో కరోనా మరణాలు ఇటలీని మించి పోతున్నాయి. అగ్రరాజ్యంలో కేవలం 24 గంటల వ్యవధిలోనే 1,845 మంది కరోనాకు బలయ్యారు. దీన్ని బట్టి చూస్తే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా అర్థం చేసుకోవచ్చు.

వయస్సుతో సంబంధం లేకుండా పెద్దవాళ్లు, కుర్రవాళ్లు అందరూ కరోనాకు బలవుతున్నారు. అమెరికాలో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 12,841 చేరుకోగా, నిన్న ఒక్కరోజే 27,000 లకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి.

అమెరికాలో ఇప్పటి వరకు 4,00,335 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఎప్పుడు జనాల రద్దీతో కలకలలాడే న్యూయార్క్‌ నగరాన్ని స్మశానాన్ని తలపిస్తోంది. గడిచిన 24 గంటల్లో న్యూయార్క్ నగరంలోనే 731 మంది కరోనా వల్ల మరణించారు. న్యూయార్క్ నగరంలో ఇప్పటి వరకూ 5,489కి మరణించారు.

చూశారు కదా బయటి దేశాల్లో పరిస్థితి ఎంత భయకంరంగా ఉందో, ఇకనైనా మేలుకోండి. ఇళ్ల నుంచి బయటకు రాకండి. భారత్‌లో ఇలాంటి పరిస్థితిని తీసుకు రాకండి. లాక్‌డౌన్‌కు సహకరించండి. కరోనాకు దూరంగా ఉండండి. మీ కుటుంబాన్ని, మీ చుట్టూ ఉన్న సమాజాన్ని రక్షించుకోండి.

corona-death-usa

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s