ఈ ఫొటోలో కనిపిస్తున్న బుల్లబ్బాయి ఇప్పుడు ఓ స్టార్ హీరో. ఈ చిన్ననాటి సిసింద్రినే హీరో అఖిల్. తెలుగు సినిమా లెజెండ్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వర రావుకి ముద్దుల మనవడు మనవడు. అక్కినేని నాగార్జునకి అల్లరి తనయుడు. నేడు హీరో అఖిల్ పుట్టినరోజు. హ్యాపీ బర్త్ డే అఖిల్.
అఖిల్ జన్మదినాన్ని పురస్కరించుకొని మెగాస్టార్ చిరంజీవి ఓ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దాని సారాంశం ఇది “Happy Birthday Akhil. Charan కి ఒక తమ్ముడు. సురేఖకి, నాకు just like son. Most eligible bachelor and most loved kid. Have a great year ahead” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
ఇకపోతే హీరో అఖిల్ విషయానికి వస్తే.. స్టార్ హీరోస్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ అఖిల్ హీరోగా నటించిన మూడు సినిమాలు తెలుగు ప్రేక్షకులను అంతగా అలరించలేక పోయాయి. ఈనేపథ్యంలో ఈసారి అఖిల్‌తో గట్టి హిట్ కొట్టించే బాధ్యతను స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తన భుజాలపై వేసుకున్నాడు.
బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా రాబోతోంది. బన్నీ వాసు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాపై అల్లు అరవింద్‌తో పాటు హీరో నాగార్జున ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అందాల భామ పూజా హెగ్డే ఇందులో కథానాయికగా నటిస్తోంది. మరి ఈ చిత్రం అఖిల్‌కు ఎలాంటి సక్సెస్‌ను తెచ్చిపెడుతోంది వేచి చూడాలి.