అమెరికాలో కరోనా మహమ్మారి మరో భారతీయుడ్ని బలి తీసుకుంది. న్యూయార్క్‌లో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న ఇండియన్-అమెరికన్ జర్నలిస్ట్ బ్రహ్మానందం కంచిబొట్ల కోవిడ్-19 వైరస్‌తో మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు సుధమ కంచిబొట్ల వెల్లడించారు.
బ్రహ్మానందం కంచిబొట్ల వయస్సు 66 ఏళ్లు, యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియాకు కరెస్పాండెంట్‌గా పనిచేసే వారు. ఈయన 1992లో అమెరికా వెళ్లారు, 11 ఏళ్ల పాటు మెర్జర్ మార్కెట్స్‌కు కంటెంట్ ఎడిటర్‌గా పనిచేశారు. ఆ తర్వాత యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియాలోకి మారారు. ఈయన దాదాపు 9 రోజుల పాటు కరోనాతో పోరాటం చేసి ఓడిపోయారు. సోమవారం నాడు కన్ను మూశారు.
న్యూయార్క్ నగరంలో ఇప్పటి వరకూ 4,758 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అమెరికా వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటి వరకూ 3,69,179 మందికి కరోనా పాజిటివ్ రాగా ఇందులో 11,013 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. 19,843 మంది కరోనా నుంచి కోలుకున్నారు.