ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో, నేతలే ప్రజల వద్దకు వెళ్లి వారి బాగోగులు తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగానే చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని నగరంలోని ఇంటింటికీ వెళ్లి కూరగాయలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో చిలకలూరిపేట ప్రజలు ప్రభుత్వానికి చేయాల్సిన సాయం ఇళ్లలో ఉండటమేనని, వారికి కావాల్సిన అన్ని అవసరాలను తీర్చే బాధ్యత తమదేనని రజని చెప్పారు.
పట్టణంలోని 26వ వార్డు నాయకురాలు చెంబేటి భారతి ఆధ్వర్యంలో ఆమె కూతురు ఉమామహేశ్వరి జన్మదినం సందర్భంగా సుమారు 1100 కుటుంబాలకు ఇంటింటికి ఒక్కొకరికి 5 కేజీల చొప్పున కూరగాయలు పంపిణీ చేశారు.
కరోనా వైరస్ వ్యాప్తి వల్ల జనజీవనం ఎన్నో ఇబ్బందులకు గురవుతోందని, ఉపాధి కోల్పోయి, ఆదాయం లేక నిరుపేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. వీరందరినీ ఆదుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ ముందుకు వస్తోందని చెప్పారు. ప్రతి నిరుపేద ఇంటికి తమ తరఫున సాయం అందేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు.