లాక్‌డౌన్ పొడగిస్తారా లేదా..?

కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్‌ను మరికొన్ని వారాల పాటు పొడగిస్తారా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఈ విషయంలో మాత్రం ఇప్పటికే అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రధాని ప్రకటించిన లాక్‌డౌన్ ఏప్రిల్ 14వ తేదీతో ముగియనుంది. మరోవైపు దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోతుండటంతో ఈ లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజుల పాటు పొడగించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

తెలంగాణా రాష్ట్ర సీఎం కేసీఆర్‌తో పాటుగా మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులు కూడా లాక్‌డౌన్‌ను పొడగించాలని కోరుతున్నారు. ప్రస్తుతం కేంద్రం ఈ విజ్ఞప్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఢిల్లీ మర్కజ్​ ఘటన తర్వాత దేశంలో కరోనా కేసులు రెట్టింపు అయ్యాయి, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా లాక్​డౌన్​ను ఎత్తివేస్తే సమస్య మరింత తీవ్రమవుతుందని పలు రాష్ట్రాల భావిస్తున్నాయి.

లాక్‌డౌన్ విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ప్రజలు/ప్రభుత్వాలు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా సూచించారు. కరోనా లేని భారత్ కోసం కష్టమైనా కొన్ని రోజులు భరిద్దామని సూచన ప్రాయంగా లాక్‌డౌన్ పొడగింపు గురించి చెప్పారు. దేశంలో కరోనా వ్యాప్తి, కేసుల పెరుగుదలను సమీక్షించిన తర్వాత లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ పొడగింపుపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అన్నారు.

దేశంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, ఇప్పటి వరకూ పాటిస్తూ వచ్చిన లాక్‌డౌన్ ఓ రకంగా మంచి ఫలితాలను ఇచ్చిందనే చెప్పాలి. ఇతర దేశాలతో పోల్చుకుంటే, మనదేశంలో అతి తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీనికి కారణం మన ప్రభుత్వం ముందస్తుగా లాక్‌డౌన్‌ను ప్రకటించడమే. ఈ లాక్‌డౌన్‌ను కనీసం మరో రెండు వారాలు పాటు పొడిగించినట్లయితే కరోనా కేసులు భారీగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.

ఏదేమైనప్పటికీ.. లాక్‌డౌన్ పొడగింపుపై కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ లాక్‌డౌన్‌ను పొడగిస్తారా లేదా అనేది మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.

lockdown

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s