దేశంలో స్త్రీల రక్షణ కోసం ఎన్ని రకాల చట్టాలు తెచ్చినా, కామాంధుల్లో ఎలాంటి మార్పు రావటం లేదు. వీరి కామ దాహానికి అబలలు అన్యాయంగా బలైపోతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా, చిన్నారులన్న కనికరం కూడా లేకుండా లైంగిక దాడికి పాల్పడుతున్నారు దుర్మార్గులు.
తాజాగా.. నిజామాబాద్లో సభ్యసమాజం తలదించుకునే ఘటన ఒకటి చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లాలోని దర్పల్లి మండల కేంద్రం గోసంగి కాలనీలో తాత వయస్సున్న ఓ వృద్ధుడు ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కడమంచి రాములు (57) అనే వృద్ధుడు ఆరేళ్ల చిన్నారిని చాక్లెట్ల ఆశ చూపించిన ఇంట్లోకి పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఏడుస్తూ ఇంటికి వెళ్లిన చిన్నారి ఈ విషయాన్ని తన తల్లికి తెలపడంతో కాలనీ వాసులు వృద్ధుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిన్నారిని వైద్య పరీక్షలు, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.