జపాన్‌కు టూవీలర్ దిగ్గజం హోండా ఓ సరికొత్త స్కూటర్‌ను గ్లోబల్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. కంపెనీ ఆఫర్ చేస్తున్న పిసిఎక్స్150 మోడల్లో 2020 వెర్షన్‌ను ఇటీవలే థాయ్‌లాండ్ మార్కెట్లో విడుదల చేసింది. యూత్‌ని ఆకట్టుకునేలా, ప్రీమియం లుక్ అండ్ ఫీల్ కలిగిన కలిగిన 2020 హోండా పిసిఎక్స్150 మాక్సీ స్కూటర్ ఇప్పుడు నాలుగు కొత్త రంగుల్లో లభ్యమవుతుంది.
హోండా పిసిఎక్స్150 మాక్సీ స్కూటర్ ప్రస్తుతం మన మార్కెట్లో లభిస్తున్న కన్వెన్షల్ స్కూటర్ల కన్నా విభిన్నంగా ఉంటుంది. స్పోర్టీ లుక్ ఉండే ఈ స్కూటర్లో 149సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు ఇది గరిష్టంగా 13.3 బిహెచ్‌పిల పవర్‌ను, 14 ఎన్ఎమ్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో సివిటి ట్రాన్సిమిషన్ (ఆటోమేటిక్ గేర్‌బాక్స్) ఉంటుంది.
ప్రస్తుతానికి ఇది థాయ్‌లాండ్ మార్కెట్లలోనే లభిస్తోంది. ప్రీమియం ఫీచర్లతో కూడిన ఈ స్కూటర్ ధర కూడా అధికంగానే ఉండొచ్చని అంచనా. భారత్‌లో స్కూటర్లకు డిమాండ్ ఎక్కువే అయినప్పటికీ, ఇంతటి ప్రీమియం స్కూటర్ ఇండియన్ మార్కెట్లో సక్సెస్ అవుతుందో లేదో తెలియదు. ఇది ఇండియా మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. మరి మీకూ ఇలాంటి స్కూటర్‌ను ఇండియాలో చూడాలని ఉందా?