కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ అందిస్తున్న ఎలాంట్రా సెడాన్‌లో ఓ కొత్త అప్‌గ్రేడెడ్ 2020 వెర్షన్‌ను కొరియన్ మార్కెట్లో విడుదల చేసింది. అతి త్వరలోనే ఇది ఇండియా మార్కెట్లో కూడా విడదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొరియన్ వెర్షన్ 2020 హ్యుందాయ్ ఎలాంట్రా స్టైల్, స్మార్ట్, మోడ్రన్, ఇన్స్పిరేషన్ అనే నాలుగు వేరియంట్లలో లభ్యం కానుంది.
ఈ ఏడవ తరం హ్యుందాయ్ ఎలాట్రా కొరియన్ మార్కెట్లో పెట్రోల్, ఎల్పిజి ఆప్షన్లలో లభ్యం కానుంది. పెట్రోల్ వెర్షన్లో స్మార్ట్‌స్ట్రీమ్ జి1.6 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 6300 ఆర్పీఎం వద్ద 123 పిఎస్‌ల పవర్‌ను, 4500 ఆప్పీఎం వద్ద 154 ఎన్ఎంల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్ లేదా స్మార్ట్‌స్ట్రీమ్ ఐవిటి ఆటోమేటిక్ గేర్ ఆప్షన్లతో లభిస్తుంది.
మ్యాన్యువల్ వెర్షన్ 14.4 కెఎంపిఎల్ మైలేజీని, ఆటోమేటిక్ వెర్షన్ 15.4 కెఎంపిఎల్ మైలేజీనిస్తుంది. భారత్‌లో ఇది పెట్రోల్, డీజిల్ ఆప్షన్లలో లభివంచ్చని తెలుస్తోంది. భారత మార్కెట్లో దీని ప్రారంభ ధర సుమారు రూ. 9.5 లక్షలకు పైనే ఉండొచ్చని అంచనా. కొత్త ఎలాంట్రా ఎక్స్టీరియర్, ఇంటీరియర్లలో అనేక మార్పులు చేర్పులు చేశారు.