హైదరాబాద్‌లో కరోనా కారు..

కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అనేక మంది పలు రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా.. హైదరాబాద్‌కు చెందిన సుధా కార్స్ సంస్థ అధినేత సుధాకర్ కరోనా వైరస్ ఆకారంలో ఓ కారును తయారు చేశారు. హైదరాబాద్ రోడ్లపై హల్‌చల్ చేస్తున్న ఈ కరోనా కారు ఇప్పుడు బాగా ట్రెండింగ్‌లో ఉంది. కరోనాపై అవగాహన కల్పించేందుకు ఈ కారును తయారు చేసినట్లు సుధాకర్ తెలిపారు.

ఇక కరోనా కారు విషయానికి వస్తే.. ఇందులో 100సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ కారులో ఒక్కరికి మాత్రమే చోటు ఉంటుంది. ఈ కారుకు ఆరు చిన్నపాటి చక్రాలు ఉంటాయి. ఫైబర్ బాడీతో తయారైన ఈ కారు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ కారును తయారు 10 రోజుల్లోనే తయారు చేసినట్లు సుధాకర్ తెలిపారు. సుధా కార్స్ సంస్థ ఇప్పటికే పలు రకాల మోడళ్లలో వాహనాలను తయారు చేసి మంచి పాపులారిటీని దక్కించుకుంది.

corona-car